ముంబైలో క్లోరిన్ గ్యాస్ లీక్ : ముగ్గురు మృతి, పలువురికి అస్వస్థత

విషయం తెలిసిన వెంటనే లీకేజీని అదుపు చేయడానికి తమ సిబ్బంది వెళ్లారని, వారిలో నలుగురు అస్వస్థతకు గురయ్యారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉదయ్ తత్కారే చెప్పారు. దాదాపు 59 మందిని సమీపంలోని జెజె ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించారు. ముంబై పోర్టు ట్రస్టు ఆవరణలోని స్క్రాప్ యార్డులో ఈ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications