వైయస్ జగన్ పై ఒత్తిడి పెంచుతున్న కాంగ్రెసు హైకమాండ్

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం మరింతగా పట్టు బిగిస్తోంది. జగన్ ను ఏకాకిని చేయాలనే హ్యూహంతో పనిచేస్తోంది. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని పార్టీ పార్లమెంటు సభ్యులకు, ఇతర నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లిన పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను నిలదీసింది. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని మరోసారి హైకమాండ్ స్పష్టం చేసింది. జగన్ పై పార్టీ నేతలతో విమర్శనాస్త్రాలు సంధింపజేస్తోంది. జగన్ యాత్రలో పాల్గొనే నేతల గురించి ఆరా తీస్తోంది. ఇంటిలిజెన్స్ నిఘాను ఏర్పాటు చేసింది.

తొలిసారి గెలిచిన శాసనసభ్యుల వివరాలను సేకరిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరో తెలియదంటూ, వైయస్ వల్లనే తాము గెలిచామని చెబుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండో సారి గెలిచినవారి గురించి కూడా ఆరా తీస్తోంది. వారి ఆస్తుల వివరాలను, వారి రాజకీయేతర కార్యకలాపాలాను సేకరిస్తోంది. వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని విలువైన భూములను దక్కించుకున్నవారి గురించి వివరాలు సేకరిస్తోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న నాయకుల వివరాలు కూడా సేకరిస్తోంది. అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకుని జగన్ ను ఒంటరి చేసే దిశగా పావులు కదుపుతోంది. జగన్ వ్యవహారంపై మంగళవారం వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ విస్తృతంగా మంతనాలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+