కత్తులు దూసుకుంటున్న జగన్ అనుకూల, వ్యతిరేక గ్రూపులు

పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుపై కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లాది విష్ణు విరుచుకుపడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కించపరిచేలా మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుపై చర్య తీసుకోవాలని ఆయన పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కోరారు. ఈ మేరకు ఆయన శ్రీనివాస్ కు ఓ లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిష్టానం ప్రమేయమే లేనట్లు విహెచ్ మాట్లాడడం అధిష్టానాన్ని ధిక్కరించడమేనని ఆయన అన్నారు. విహెచ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ వల్ల గెలిచామని చెప్పుకుంటున్న వారిపై వి. హనుమంతరావు మంగళవారం హేళన చేశారు.
కాంగ్రెసు సీనియర్లు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, తదితరులు జగన్ పై, వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ తీరుపై పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ విరుచుకుపడ్డారు. జగన్ కు పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అండగా నిలిచారు. జగన్ కోసం ఆయన పార్టీ నాయకత్వాన్ని కూడా ధిక్కరించేందుకు సిద్ధపడ్డారు. రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రా రెడ్డి జగన్ కు అండగా నిలిచారు. జగన్ పై విమర్శలు చేస్తున్న తమ పార్టీ నాయకులను వారు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications