హైదరాబాద్: దర్సక, నిర్మాత నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. దీంతో సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా నారాయణమూర్తి ఈ సినిమాను నిర్మించారు. తన సినిమా ప్రదర్శనకు థియేటర్లు లభించకపోవడంపై నారాయణ మూర్తి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బింగ్ సినిమాల వల్ల తన సినిమాకు థియేటర్లు లభించడం లేదని ఆయన అన్నారు.
ఆంధ్ర సీడెడ్ లోనే కాదు నైజాంలోనూ వీర తెలంగాణకు థియేటర్లు లభించడం లేదు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా దాని ప్రదర్శనకు థియేటర్లు లభించడం లేదని నారాయణమూర్తి అన్నారు.