అనివార్యమైన స్థితిలోనే సోంపేటలో కాల్పులు: సబితా ఇంద్రారెడ్డి

సోంపేట ఘటనలో 86 మంది పౌరులు, 37 మంది పోలీసులు, ఆరుగురు జర్నలిస్టులు గాయపడినట్లు, వారు సోంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆమె అన్నారు. కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆమె తెలిపారు. ఒకరు లక్కవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కాగా, రెండో వ్యక్తి పలాసపురానికి చెందిన జోగాపురం అని ఆమె చెప్పారు. సంఘటన జరగడం ప్రభుత్వానికి కూడా బాధగానే ఉందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications