ముఖ్యమైన పనిపై ఢిల్లీ వస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య ముఖ్యమైన పనిపై ఢిల్లీ వస్తున్నారు. రెండు రోజుల పర్యటన కొసం ఆదివారం బయల్దేరి ఢిల్లీ వస్తున్నారు. పార్టీ వ్యవహారాలను, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా, అగ్రనేతలు అహ్మద్‌ పటేల్‌, వీరప్ప మొయిలీలతో ఆయన భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ, సీఎం రోశయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాపోలు ఆనందభాస్కర్‌ ఈ సమీక్షా సమావేశానికి హాజరవుతారు.

ఉప ఎన్నికల దృష్ట్యా పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మాత్రం సమావేశానికి రాలేకపోతున్నారు. పార్టీ వ్యవస్థాగత ఎన్నికలను సమీక్షించేందుకు గత కొద్ది రోజులుగా సోనియా-పీసీసీ అధ్యక్షులతోనూ, సీఎల్పీ నేతలతోనూ, ముఖ్యమంత్రులతోనూ, పార్టీ ఇన్‌ఛార్జులుగా ఉన్న ప్రధాన కార్యదర్శులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ శనివారం సోనియాతో సమావేశం కావడం, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో సీఎం-బాబ్లీ అంశాన్ని సోనియాతో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+