మహారాష్ట్ర తీరుకు భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోంది: హరికృష్ణ

శాంతిసామరస్యాలకు, దేశభక్తికి మారుపేరైన మహారాష్ట్ర ప్రతిష్టను అశోక్ చవాన్ దెబ్బ తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, తెలుగు ప్రజల మధ్య సత్సంబంధాలున్నాయని, అశోక్ చవాన్ ఆ సంబంధాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులకు బాబ్లీ ప్రాజెక్టును చూపించాల్సిందేనని ఆయన అన్నారు. లోకసభ స్పీకర్, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాల భూమి బీడుగా మారుతుందని ఆయన అన్నారు. తాము బాబ్లీకి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందో కూడా ఆయన తన బహిరంగ లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications