బాబ్లీపై అందరం ఒకే మాటగా వివరిస్తాం: పొన్నాల లక్ష్మయ్య

Ponnala Laxmaiah
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఒకే మాటగా వినిపించాలని అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్ణయాలను ఆయన సమావేశానంతరం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. పార్టీకి ఒకరి తరఫున మాత్రమే ప్రధాని వద్దకు వెళ్లడానికి అనుమతి ఉందని, అందువల్ల అఖిల పక్ష సమావేశానికి ఒకరిని మాత్రమే అనుమతించామని, ప్రజారాజ్యం, తెరాస తదితర పార్టీల నాయకులు ఇద్దరేసి వచ్చినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సమావేశం వెలుపలే ఉండిపోయారని ఆయన వివరించారు.

బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరనున్నట్లు ఆయన తెలిపారు. కోర్టు తీర్పులకు, ఒప్పందాలకు విరుద్ధంగా అనుమతులు లేకున్నా మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దాని వల్ల దిగువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని ప్రధానికి వివరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. బాబ్లీని చూడడానికి వెళ్లిన మన రాష్ట్ర ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య స్పర్థలు, విద్వేషాలు పెచ్చరిల్లకుండా బాబ్లీ సమస్యను పరిష్కరించుకోవాలని కూడా సమావేశం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+