బాబ్లీపై అఖిల పక్ష సమావేశం నుంచి టిడిపి బాయ్ కాట్

బాబ్లీని వ్యతిరేకించే విషయంలో ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము బాయ్ కాట్ చేయడంలో రాజకీయం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి తాము వినతిపత్రం ఇచ్చామని, ప్రభుత్వ వాదనకు తాము ఓ సవరణ చెప్పామని ఆయన అన్నారు. బాబ్లీకి గేట్లు పెట్టవద్దని సుప్రీంకోర్టు మహారాష్ట్రను ఆదేశిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రధానిని కోరాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
అఖిల పక్ష సమావేశంలో చిరంజీవి (ప్రజారాజ్యం), వినోద్ (తెరాస), జూలకంటి రంగారెడ్డి (సిపిఎం), నారాయణ (సిపిఐ) తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications