తెలుగుదేశం పార్టీకి మిగిలింది తీర్ధయాత్రలే: విజయశాంతి

Vijayashanthi
హైదరాబాద్: తెలంగాణా వాదాన్ని ఉపఎన్నికలలో గెలిపించిన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకురాలు విజయశాంతి కృతజ్ఞతలు తెలియజేశారు. ధరావతులు సైతం కాపాడుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఇక తీర్థయాత్రలే గతి అని ఆమె దేశం బాబ్లీ యాత్రపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. క్రిందటి ఎన్నికలలో తెలంగాణాలో ప్రజారాజ్యం గల్లంతు కాగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గల్లంతు అయ్యిందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో విశ్లేషించారు.

ఈ ఉపఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ చేతిలో రెండోసారి ఓడిపోయిన పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరులోని రెండు అక్షరాలైన డి.ఎస్.కు విజయశాంతి ఆసక్తిదాయకమైన వివరణ ఇచ్చారు. ఆ పేరులోని డి అంటే నో డిపాజిట్ అని, ఎస్ అంటే నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు. తెరాస విజయం క్రెడిట్ అంతా ప్రజలదేనని ఆమె అన్నారు. ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆమె అన్నారు. కాంగ్రెసు నాయకులు మాట మారుస్తూ ఉంటారని ప్రజలు అనుకుంటున్నారని, కాంగ్రెసు నాయకులను ప్రజలు తిడుతున్నారని ఆమె అన్నారు. బాబ్లీ పోరు చంద్రబాబు పోరాటం నాటకమేనని ఆమె అన్నారు. ఎన్నికల్లో తన విధి తాను నిర్వహించానని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+