తెలంగాణ రాష్ట్రం కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఇషాంత్ రెడ్డి శుక్రవారం రాత్రే అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు కారణం తెలియజేస్తూ అతను ఓ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఓడిపోతే ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకుంటున్నానని అతను రాశాడు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్, కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ద్రోహులని అతను రాశాడు.
తన మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకూడదని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాలని అతను కోరుకున్నాడు. ఇషాంత్ రెడ్డి మృతదేహం వద్దకు పెద్దయెత్తున విద్యార్థులు చేరుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకుందామని విద్యార్థి నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications