తమిళనాడు రోడ్డు ప్రమాదంలో 8 మంది కర్నాటకవాసుల మృతి
National
oi-Pratapreddy
By Pratap
కాంచీపురం రోడు ప్రమాదం
చెన్నై: తమిళనాడులోని కంచి సమీపంలో లారీ, టాటాసుమో ఢీకొని ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. మృతులు కర్నాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాకు చెందినవారు.
టాటా సుమోలో కర్నాటక వాసులు తిరుత్తణిలోని ఆలయానికి వెళ్లి కాంచీపురం వెళ్తుండగా బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.