కొండా సురేఖపై ఆగ్రహం: రేపోమాపో క్రమశిక్షణా చర్యలు

కాగా, పార్టీ నాయకులు చాలా మంది ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా సురేఖ తీరుపై మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆమెకు రేపోమాపో షోకాజ్ నోటీసు జారీ కావచ్చుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచందర్ రావుపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సురేఖపై కూడా చర్యలకు దిగవచ్చునని అంటున్నారు. కాగా, తనకు ఇంకా అటువంటి సమాచారమేదీ లేదని, చర్యలు తీసుకున్న తర్వాత స్పందించడానికి వీలుంటుందని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని సురేఖ అన్నారు.
తాను పార్టీ బాగు కోసమే మాట్లాడానని ఆమె చెప్పారు. తాను సోనియాపై విమర్శలు చేయలేదని ఆమె చెప్పారు. సురేఖ వ్యవహారంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సమీక్షించినట్లు సమాచారం. పార్టీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో డిఎస్ తో మొయిలీ మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications