కొండా సురేఖ లేఖతో జగన్ కు సంబంధం లేదు: అమర్నాథ్ రెడ్డి

Konda Surekha
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యపై విమర్శలు చేస్తూ తమ పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖ రాసిన లేఖతో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఏ విధమైన సంబంధం లేదని కాంగ్రెసు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. లేఖలో సురేఖ తన వ్యక్తిగతమైన ఇబ్బందులను తెలిపిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సురేఖ లేఖ పూర్తిగా వ్యక్తిగతమని ఆయన అన్నారు.

జగన్ ఎదుగుదల కాంగ్రెసు పార్టీతోనే ముడివడి ఉందని ఆయన అన్నారు. అమర్నాథ్ రెడ్డి కూడా వైయస్ జగన్ వర్గానికి చెందినవారే. సురేఖ లేఖతో తీవ్ర కలకలం చెలరేగడంతో ఆయన ఈ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సురేఖ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+