వైయస్ జగన్ వెళ్లిపోతే కాంగ్రెసుతో చిరంజీవి రెడీ

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పూనుకుంటే ఆదుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రెడీగా ఉన్నట్లే తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ సన్నద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసిన వ్యాఖ్య అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో పడితే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు వినిపిస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.."ప్రజలపై మళ్లీ భారం పడకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే దాని ప్రకారం ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తాం" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ ఇప్పటికీ సమైక్యాంధ్ర మాటమీదే ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. తమ పార్టీ ఈ విషయంలో వెనకడుగో, తప్పటడుగో, ముందడుగో వేస్తుందని కొన్ని పత్రికలు రాయడం ధర్మం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశంలో పాల్గొన్నపుడు ప్రజాభిప్రాయ సేకరణకోసం నిపుణుల కమిటీ వేయాలని సూచించామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నందున దానికి అనుగుణంగానే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్లే కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+