వైయస్ జగన్ ను దూరం పెట్టిన కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు

కాగా, ముఖ్యమంత్రి రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్యను వెనకేసుకొచ్చారు. రోశయ్యను మించిన బలమైన నాయకుడు లేడని ఆయన అన్నారు. సురేఖకు అధికారం అప్పగించాలా అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపిల సమావేశానికి దివంగత నేత వైయస్ ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా హాజరు కాలేదు. ఆయనకు ఆహ్వానం అందిందా, లేదా అనేది తెలియదు. జగన్ పార్టీలో ఉంటేనే మంచిదని, జగన్ అధిష్టానం మాట వింటే బాగుంటుందని సమావేశంలో ఓ అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications