కాంగ్రెసు ఎంపిల విందులు: ఎవరి రూటు వారిదే

సమైక్య భావనను అధిష్టానానికి వినిపించాలని కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమైన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. భేటీ అనంతరం అనకాపల్లి ఎంపీ సబ్బంహరి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలంతా శ్రీకృష్ణ కమిటీని ఢిల్లీలో కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను లేఖ రూపంలో వారి ముందు పెట్టాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న చిన్నపాటి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి అధిష్ఠానం ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత ఏడాది హోంమంత్రి ప్రకటన తర్వాత పార్టీ పెద్దలను కలవడం తప్ప ఆ తర్వాత ఎంపీలంతా ఉమ్మడిగా అధిష్ఠానాన్ని కలవలేదని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications