కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ

తొలుత పీసీసీ క్రమశిక్షణ సంఘం పార్టీ నియమావళి ప్రకారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఆ తరువాత రాంబాబు సమాధానం ఇచ్చేలోగానే అధిష్ఠానం నేరుగా సస్పెండ్ చేసింది. అదే రీతిలో తక్షణ స్పందనగా షోకాజ్ ఇచ్చినా సురేఖపై వేటు తప్పదని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే సోనియాగాంధీ జగన్ వ్యవహారంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాష్ట్ర పార్టీ పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. అయితే సురేఖ ఎమ్మెల్యే కావడం వల్ల అధిష్ఠానం తొందర పడదనీ, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటుందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications