చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నాయకుల తిరుగుబాటు?

Nagam Janardhan Reddy
హైదరాబాద్: సమైక్యవాదానికి మొగ్గు చూపుతున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తిరుగుబాటుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణల మధ్య గొడవ వస్తే మీరు ఎటువైపుంటారని చంద్రబాబు వేసిన ప్రశ్నపై వారు తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, సున్నితమైన అంశాన్ని లేవనెత్తి తనను, పార్టీని ఇబ్బంది పెట్టవద్దని గురువారం చేసిన సూచనపై కూడా వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ నాయకులు గురువారం సాయంత్రం నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి నేతృత్వంలో సమావేశమై చంద్రబాబుపై తెలంగాణ విషయంలో ఒత్తిడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో తాము అమీతుమీ తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమావేశం వివరాలను ఓ తెలంగాణ నాయకుడు మీడియాకు లీక్ చేశారు. దీంతో కలకలం ప్రారంభమైంది. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబును కలిసేందుకు సిద్ధపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇవ్వాలని వారు పట్టుబట్టేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏ మాత్రం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించవద్దని సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అనుకూల వైఖరికి చంద్రబాబు బాహాటంగా స్వస్తి చెప్పడంతో తాము ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లాలో చెప్పాలని తెలంగాణ నాయకులు చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+