వైయస్ జగన్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

Rahul Gandhi
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగన్ తీరు మొదటి నుంచీ నచ్చడం లేదు. రాష్ట్రానికి చెందిన యువ శాసనసభ్యులతో, కొంత మంది నాయకులతో మాట్లాడిన తర్వాత జగన్ తీరును ఇక మాత్రం అనుమతించడానికి వీలు లేదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే అధిష్టానం జగన్ అనుచరులపై చకచకా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టినట్లు భావిస్తున్నారు.

పార్టీకి జగనే ప్రధాన ఆకర్షణ అని, అంతటి ప్రజా నాయకుడు మరొకరు లేరని, ఆయన లేకుంటే రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన వర్గం చేస్తున్న ప్రచారం పట్ల రాహుల్ మండిపడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర నాయకత్వంపైన, అధిష్ఠానంపైన జగన్ వర్గం గతంలో ఇంతకన్నా ఎక్కువగా విమర్శలు గుప్పించిందని, అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కానీ రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ సమీక్ష చేపట్టి, లోతుగా విశ్లేషించిన తర్వాత ఢిల్లీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని, జగన్ వర్గీయులపై వరుసగా వేటు పడడం మొదలైందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+