హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస నేత కె చంద్రశేఖరరావు విమర్శలకు భయపడం: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శలకు తాను భయపడబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనను రెచ్చగొట్టవద్దని ఆయన కెసిఆర్ కు హితవు చెప్పారు. తెలంగాణలో తమ క్యాడర్ ను, నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు తమపై ఎడతెగకుండా తెరాస విమర్శిస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెసుపై తెరాస నాయకులు విమర్సలు చేయడం లేదని, సామాజిక తెలంగాణ అని చెప్పి సమైక్యాంధ్ర నినాదాన్ని పుచ్చుకున్న ప్రజారాజ్యం పార్టీని వదిలేశారని, ఇతర పార్టీలను కూడా ఏమీ అనడం లేదని, తమనే తెరాస నాయకులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన మాటలను తెరాస నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివని, రెండు ప్రాంతాలు తనకు సమానమేనని చెప్పానని, దాన్ని తెరాస నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల నాయకులు పనిచేయడానికి తాను వెసులుబాటు కల్పించానని ఆయన చెప్పారు. తమను పోరాటం చేయవద్దని చెప్పడం తెరాసకు తగదని ఆయన అన్నారు. ఒక రాజకీయ పార్టీగా తెరాస నాయకులు అసభ్యంగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. సున్నితమైన, జటిలమైన సమస్యపై తాము ఆచితూచి వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు.

బాబ్లీపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ సమస్యకు రాజకీయ పరిష్కారం చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాబ్లీపై పోరాటానికి 9 మందితో కమిటీ వేశామని, ఈ కమిటీకి ఎర్రబెల్లి దయాకర రావు నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. బాబ్లీపై పోరాటంలో ఇతర రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను కలుపుకుంటామని ఆయన చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో పాదయాత్రలు చేస్తామని ఆయన చెప్పారు. గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X