ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ - ముందుగా వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లబ్దిదారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కేటాయింపు మార్గదర్శకాలు.. పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోయిన 35,200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకంలో ఎల్-2 లబ్దిదారులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి విడతలోని ఎల్-2 లబ్దిదారులకు వీటిని అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తాజా కసరత్తు కొనసాగుతోంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. త్వరలో ఎల్-2 లబ్దిదారులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మొదటి విడతలోని ఎల్-2 లబ్దిదారులకు వీటిని అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని వల్ల ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, దీపి దకవానా ఇళ్లు లేని పేదలకు లబ్ది చేకూరుతుందని భావిస్తోంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి హౌసింగ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో కేటాయించిన ఇళ్లల్లో జూన్ నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. జూన్ మొదటి వారానికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 3.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 2.66 లక్షల ఇళ్ల పనులు జరుగుతున్నాయి. ఇక లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు వేగంగా జరపాలని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని నిర్దేశించారు.

మంత్రి కీలక ఆదేశాలు
కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయంలో మొదలుపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చాలా ప్రాంతాలు అసంతపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అందించనున్నారు. ఇక భూభారతి కార్యక్రమంలో ఈ సమావేశంలో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని.. భూభారతి చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇక.. గ్రేటర్ పరిధిలో లబ్ది దారులకు ఇళ్ల కేటాయింపు పైన కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇక్కడ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు.













Click it and Unblock the Notifications