కుప్పకూలిన బంగారం ధరలు- డౌన్ ట్రెండ్
దేశీయంగా బంగారం, వెండి ధరలు నేడు అనూహ్యంగా తగ్గాయి. డాలర్ బలహీన పడటం, అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చల్లో పురోగతి నెలకొనడం వంటివి దీనికి ప్రధాన కారణాలు అయ్యాయి. ఈ నెలాఖరుకు బలహీనమైన ధోరణిని కొనసాగించాయి. రెండు రోజుల పాటు ఓ మోస్తరుగా పెరిగిన పసిడి, వెండి రేట్లు నేడు మళ్లీ నేలచూపులు చూడటం మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు, స్థానిక మార్కెట్‌లో లోయర్ డిమాండ్, అనిశ్చితి వంటివి ఈ పతనానికి కారణమయ్యాయి.
దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 15,371 వద్దకు చేరింది. 22 క్యారెట్లు రూ. 14,090, 18 క్యారెట్లు రూ. 11,528కి తగ్గింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లోనూ బంగారం ఒత్తిడిని ఎదుర్కొంది. జూన్ డెలివరీ కాంట్రాక్ట్ 0.23 శాతం తగ్గి, 10 గ్రాములకు రూ. 1,52,350 వద్ద ముగిసింది. రేట్ల తగ్గుదల పెట్టుబడిదరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. మున్ముందు మరింత క్షీణించే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్స్‌కు దాదాపు 4,700 వద్ద స్థిరంగా ఉంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,382, 22 క్యారెట్లు - రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,760
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,300, 22 క్యారెట్లు- రూ. 14,025, 18 క్యారెట్లు - రూ. 11,475
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,300, 22 క్యారెట్లు- రూ. 14,025, 18 క్యారెట్లు - రూ. 11,475
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,300, 22 క్యారెట్లు- రూ. 14,025, 18 క్యారెట్లు - రూ. 11,475
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,300, 22 క్యారెట్లు- రూ. 14,025, 18 క్యారెట్లు - రూ. 11,475
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,300, 22 క్యారెట్లు- రూ. 14,025, 18 క్యారెట్లు - రూ. 11,475

Click it and Unblock the Notifications