వైయస్ జగన్ తో రాజీ యత్నాల వార్తలను కొట్టేసిన ఎఐసిసి

సందీప్ దీక్షిత్ తో వైయస్ జగన్ భేటీపై మాట్లాడేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడేందుకు నిరాకరించారు. జగన్ ఓదార్పు యాత్రపై గానీ జగన్ వ్యవహారంపై గానీ మాట్లాడేందుకు కాంగ్రెసు వర్గాలు ఇష్టపడడం లేదు. సందీప్ దీక్షిత్ ను తాను కలిసిన విషయాన్ని వైయస్ జగన్ కూడా ధ్రువీకరించారు. అయితే తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్, సందీప్ దీక్షిత్ ఒకే కారులో పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications