సీమాంధ్ర మంత్రులు ప్రభుత్వంపై ఉమ్మేశారు: కె చంద్రశేఖర రావు

అధికారంలో ఉన్నప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చిల్లి గవ్వ ఇవ్వని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబ్లీపై పోరాటమని నాటకాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేశాయని ఆయన విమర్శించారు. శ్రీరాంసాగర్ మరమ్మతుకు నిధులు ఇవ్వకపోతే పంటలు పండే పరిస్థితి లేదని ఆయన అన్నారు. శ్రీరాంసాగర్ రాష్ట్రంలోని ప్రాజెక్టు కాదా అని ఆయన ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ ఈ యేడు నిండే పరిస్థితి ఉందని, దాని మరమ్మతుకు నిధులు అవసరమని ఆయన చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుక మరమ్మతుకు 300 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
శాసనసభను కూడా ధిక్కరిస్తూ డిజిపి గిరీష్ కుమార్ వ్యవహరించారని ఆయన విమర్శించారు. రోశయ్యకు గట్స్ ఉంటే డిజిపి గిరీష్ కుమార్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోతిరెడ్డి పాడును శ్రీకృష్ణ కమిటీకి చూపించడానికి అధికారులు నిరాకరించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. పోతిరెడ్డిపాడుకు వెళ్తే కాశ్మీర్ లో లాంటి పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆయన అన్నారు. అధికారులు ఉన్నదే కమిటీకి సహకరించడానికని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications