హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ దేశంపై యుద్ధమై: సీమాంధ్ర మంత్రుల రిపోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేయడం దేశంపై యుద్ధం ప్రకటించడమేనని సీమాంధ్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోరడం దేశద్రోహమని సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో ఆరోపించినట్లు వచ్చిన వార్తలతో తెలంగాణ ప్రాంతంలో రెండు మూడు రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము అలా అనలేదని మంత్రి గాదె వెంకటరెడ్డి చెప్పారు. అయితే, సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదిక వివరాలను తెలుగు టీవీ చానెల్ జీ 24 గంటలు మంగళవారం బయటపెట్టింది.

జీ 24 గంటలు చానెల్ అందించిన వివరాల ప్రకారం సీమాంధ్ర మంత్రుల నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై కమిటీని వేయడం ఆశ్చర్యకరం. ఆత్మగౌరవం, స్వయం పాలన పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని అడగడం దేశ సమైక్యతకు భంగం కలుగుతుంది. అది దేశవ్యతిరేక డిమాండ్, అది దేశవిచ్ఛిన్నతకు దారి తీస్తుంది. తెలంగాణ డిమాండ్ కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలాంటిదే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X