హరికృష్ణ బహిరంగ లేఖ: తెరాస నేత కెసిఆర్ పై శివాలు

Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ మరో బహిరంగ లేఖ సంధించారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై శివాలు ఎత్తుతూ బుధవారం ఈ లేఖ రాశారు. సమైక్య వాదాన్ని సమర్థిస్తూ ఆయన ఆరు పేజీల లేఖ రాశారు. అధికార వ్యామోహంతో పిల్లలను కెసిఆర్ ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుగడ్డను పగుల గొట్టి నవ్వుల పాలు కావద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఎన్టీరామారావు నిర్మించిన తెలుగుజాతిని నాశనం చేయవద్దని ఆయన హితవు పలికారు. 12 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న కెసిఆర్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ ను ఇంత వాడ్ని చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ విడదీయలేనివని, టిడిపి తెలంగాణలోనే పుట్టిందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవం తెచ్చారని ఆయన చెప్పారు. పదవీ వ్యామోహంతో, మంత్రి పదవి కోసం కెసిఆర్ తిన్నింటి వాసాలు లెక్కించారని ఆయన ఆరోపించారు. తెరాస రిటైల్ సేల్ సంస్థగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తేవడానికి కాకుండా తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యలపై కెసిఆర్ దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు.

పనిలో పనిగా హరికృష్ణ కాంగ్రెసు పార్టీపై కూడా నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల అమాయకత్వంతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ తెస్తాం, ఇస్తాం, చస్తామంటున్న కాంగ్రెసు పార్టీ పార్లమెంటులో ఎందుకు బిల్లు ప్రతిపాదించడం లేదని ఆయన అడిగారు. బిల్లు పెడితే ఎవరైనా అడ్డుకోగలరా అని ఆయన అన్నారు. కెసిఆర్, జానా రెడ్డిలను ఘనాపాటీలను చేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+