హైకోర్టులో టిడిపికి చుక్కెదురు: కార్యకర్తల అరెస్టుకు లైన్ క్లియర్

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో బుధవారం చుక్కెదురైంది. న్యాయవాదులపై దాడి కేసులో తీగల కృష్ణారెడ్డి, ఇతర నాయకులు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆ మధ్య హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నా కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వ్యతిరేక వైఖరిని తప్పు పడుతూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. చంద్రబాబును నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు న్యాయవాదులపై దాడి చేశారు. ఈ దాడిలో న్యాయవాదులు కొంత మంది గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను సవాల్ చేస్తూ తీగల కృష్ణా రెడ్డి తదితరులు హైకోర్టుకు ఎక్కారు.

కాగా, చంద్రబాబు బుధవారం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. మద్యం, బాబ్లీ, గనులు తదితర అంశాలపై ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. మద్యంపై ఉద్యమాన్ని ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన నెల్లూరులో ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పది వేల మంది మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించాలని పార్టీ సీనియర్ల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+