వైయస్ జగన్ వర్గంపై రామోజీ రావు ఈనాడు దాడి

ఆ ప్రధాన కథనానికి బలం చేకూరుస్తూ ఓ ఉప కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రభుత్వానికి పైసా దక్కకుండా 258 ఎకరాల కుంభకోణంలో అధికారులు డూడూ బసవన్నలేనని ఈనాడు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి పైసా ఆదాయం చెల్లించకుండా 258 ఎకరాల ప్రభుత్వ స్థలంలో విల్లాలు, ఆపార్ట్ మెంట్లు కట్టుకుని అమ్ముకున్న వేల కోట్ల కుంభకోణంలోనూ సలహాదారు నీడ బయటికొస్తోందని బయట పెట్టింది. అయితే ఆ సలహాదారు పేరు మాత్రం రాయలేదు. ఆ సలహాదారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సర్కారు కళ్లల్లో సిమెంటు కొట్టారు అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. గుంటూరు జిల్లాలోని కొన్ని సిమెంటు ఫ్యాక్టరీలు ఏకంగా ప్రభుత్వ భూములనే చెర పట్టి అక్రమ మైనింగ్ పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. మొత్తం మీద, ఈనాడు దినపత్రిక ఒక పథకం ప్రకారం జగన్ వర్గానికి చెందిన లావాదేవీలపై వార్తాకథనాలను ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications