ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్: రాజ్ న్యూస్ టార్గెట్ చంద్రబాబు కూడా

ఆ ఇద్దరు శాసనసభ్యుల ఆరోపణల తర్వాత రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక వైయస్ జగన్ వర్గాన్ని లక్ష్యం చేసుకుంటూ గురువారం వార్తాకథనాలు ప్రచురించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు చెందిన ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2002లో జరిగాయి. ఆ తర్వాత దానికి సంబంధించి 2004లో వైయస్ దానికి సంబంధించి మరింత దారుణంగా వ్యవహరించారనేది రాజ్ న్యూస్ వార్తాకథనం సారాంశం. వైయస్, చంద్రబాబులిద్దరికీ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో పాత్ర ఉందని రాజ్ న్యూస్ టీవీ చానెల్ ఆరోపిస్తూ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. భూములను ఊడ్చుకు తిన్నరంటూ వ్యాఖ్యానించింది. ఒక్కరు గుడిని మింగేటోడైతే, మరొకరు గుడిలో లింగాన్ని కూడా మింగెటోడని వ్యాఖ్యానించింది. చంద్రబాబు, వైయస్ ఇద్దరూ ఈ కుంభకోణంలో జేబులు నింపుకున్నారని ఆరోపించింది. నానక్ రామ్ గుడాకు చెందిన భూములను ఎమ్మార్పీయస్ ప్రాపర్టీస్ కు ఎలా కట్టబెట్టారు, ఎవరి హయాంలో జరిగిందనే విషయంపై సవివరమైన కథనం ప్రసారం చేసింది.
ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది తెలుగు ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వైయస్ ఈనాడును టార్గెట్ చేసుకోవడానికి కారణం కూడా అదే. అందువల్ల ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రను, తెలుగుదేశం పార్టీ పాత్రను అది వెల్లడించలేదనే విమర్శ ఉంది. ఈ స్థితిలో రాజ్ న్యూస్ ఇద్దరు నాయకులను టార్గెట్ చేసుకుంది.












Click it and Unblock the Notifications