హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాష్కీ రాజకీయ అజ్ఝాని, పిల్లకాకి: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్‌: తన ఆస్తులపై విచారణ జరిపించాలని తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చేసిన డిమాండ్ పై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. తన ఆస్తులపై సిబిఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, సిబిఐ విచారణ జరిపించే బాధ్యతను యాష్కీయే తీసుకోవాలని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం జగన్ ను కలిశారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. యాష్కీ కుటుంబ సభ్యుల దొంగ వీసాల కేసుపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లిన ఘనత మధు యాష్కీదేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో యాష్కీ ఓ పిల్లకాకి అని, యాష్కీ రాజకీయ అజ్ఝానిలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రెండుసార్లు ఎంపిగా గెలిచినంత మాత్రాన జాతీయ నేత అయిపోయాననే భ్రమలో యాష్కీ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ ప్రభంజనంతోనే యాష్కీ గెలిచారని ఆయన అన్నారు. తనపై ఎన్ని విచారణలు జరిపించినా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన చెప్పారు. సిఎల్పీ వేదికగా వైయస్ పై విమర్శలు చేయడం కూడా అధిష్టానాన్ని ధిక్కరించడమే అవుతుందని ఆయన అన్నారు. వైయస్ వల్ల గెలిచినవారు సిఎల్పీ వేదికగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X