సిఎం పదవి నాకు వెంట్రుక: వైయస్ జగన్ కోట కడపలో చిరంజీవి
State
oi-Pratapreddy
By Pratap
|
కడప: ముఖ్యమంత్రి పదవి తనకు వెంట్రుక అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన కడప జిల్లాలో ఆయన ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం పూర్తి జోష్ తో జరిగింది. ఆయన యాత్రకు విశేషంగా ప్రజలు వచ్చారు. దీంతో పట్టరాని ఆనందంలో ఆయన మెగా డైలాగులు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తనకు లక్ష్యం కాదని, ప్రజల అభిమానంతో తాను అంతకన్నా ఎక్కువే అనుభవించానని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని ఆయన చెప్పారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ నేతపై ఆరోపణలు చేసిన చిరంజీవి కడప జిల్లా పర్యటనను అడ్డుకుంటామని జగన్ అభిమానులు ఇంతకు ముందు హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో కాస్తా ప్రతిఘటన ఎదురైనప్పటికీ కడప జిల్లాలో చిరంజీవి పర్యటన నిరాటంకంగా జరిగింది. పైగా ప్రజల నుంచి ఆశించిన దాని కన్నా ఎక్కువ ఆదరణే లభించింది.