తెలుగుదేశం పక్కా ఆంధ్రోళ్ల పార్టీ: తెరాస నేత చంద్రశేఖర రావు

టీడీపీకి చెందిన తెలంగాణ సీనియర్ నేతలు అనేక మంది తనతో మాట్లాడుతున్నారని, ఢిల్లీకి ఎప్పుడు వెళ్తున్నారని వాకబు చేసి మరీ మంచి రోజు చూసుకొని టీఆర్ఎస్‌లోకి వస్తామంటున్నారని తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో తెలంగాణపై వగల ప్రేమ ఒలకబోస్తూ బాబ్లీ నాటకం ఆడిన చంద్రబాబు, ఆర్డీఎస్ తూములు బద్ధలు కొడితే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. లోగడ బాబు సీఎంగా ఉన్నప్పుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆర్డీఎస్ తూములను బద్ధలు కొట్టినా స్పందించలేదని దుయ్యబట్టారు. "టీడీపీని తెలంగాణలో పుట్టించింది..పెంచింది మనమే..కాని, అక్కడ జరుగుతున్న అకృత్యాలు భరించలేకనే నేను బయటికి వచ్చాను. ఇప్పుడు మీరు వచ్చారు" అని వ్యాఖ్యానించారు. "డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ కోసం మహా భూకంపం సృష్టించి బ్రహ్మాండమైన యుద్ధం చేయాల్సి ఉంది. మీరూ బయటికి రండి. టీడీపీలోనే ఉండి ఆత్మవంచన చేసుకోవద్దు" అని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications