కె చంద్రశేఖర రావుపై నిప్పులు చెరిగిన నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆర్డీఎస్ పై, తెలంగాణపై కెసిఆర్ తనతో చర్చకు వస్తారా అని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ జెఎసిలోకి రావాలని తమ వద్దకు వచ్చి కోరి, ఆ తర్వాత బయటకు పంపించడం ద్రోహం కాదా అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో తనను వేదనకు గురి చేశారని అంటున్న కెసిఆర్ మంత్రి వదవి రాకపోవడం వల్లనే బయటకు వెళ్లిపోలేదా అని అడిగారు.

1969 తెలంగాణ ఉద్యమంలో తామంతా జైళ్లలో ఉంటే కెసిఆర్ ఎక్కడున్నారని ఆయన అడిగారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ముంబైలో సినిమాలు చూస్తూ గడిపారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విజయశాంతి సహా తెరాస నాయకులు కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడలేదా అని కూడా ఆయన అడిగారు. తెరాసలో చేరడానికి సిద్ధపడుతున్న తెలుగుదేశం నాయకుల పేర్లను దమ్ముంటే కెసిఆర్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+