రంగంలోకి దిగిన పనబాక లక్ష్మి: వైయస్ జగన్ ఓదార్పు మంతనాలు

Panabaka Lakshmi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వివాదంతో రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో వేడెక్కాయి. జగన్ ఓదార్పు యాత్రపై బుధవారం ఉదయం కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసంలో ప్రకాశం జిల్లా శాసనసభ్యులు సమావేశమయ్యారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. సోనియా రాజకీయ సలహాదారు చేసిన సూచనను జెసి దివాకర్ రెడ్డి ప్రకాశం జిల్లా శాసనసభ్యులకు తెలిపారు. దానిపై బుధవారం ఉదయం పనబాక లక్ష్మి నివాసంలో చర్చలు జరుగుతున్నాయి.

జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని పార్టీ శాసనసభ్యులకు తన మాటగా చెప్పాలని చేసిన సూచన మేరకు పనబాక లక్ష్మి నేరుగా రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. చర్చల తర్వాత ప్రకాశం జిల్లా శాసనసభ్యులు పార్లమెంటు హాల్ కు వెళ్లనున్నారు. పనబాక లక్ష్మి నివాసంలో జరిగిన చర్చల వివరాలను జెసి దివాకర్ రెడ్డి సోనియాకు నేరుగా వివరించే అవకాశం ఉంది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శాసనసభ్యులు చెబుతున్నారు. అయితే, జగన్ యాత్ర కాంగ్రెసుకు వ్యతిరేకం కాదని, ఆయన వ్యతిరేకులు దాన్ని ప్రతికూలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఒకరిద్దరు శాసనసభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+