ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థుల ప్రతిజ్ఞలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంటే ఆత్మహత్యలు కాదని వక్తలు పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ సాధించాకుందామని అన్నారు. గుండె నిబ్బరంతో వ్యవహరించాలని వారు విద్యార్థులకు సూచించారు. తెలంగాణ వచ్చి తీరుతుందని నమ్మబలికారు. కాగా, హైదరాబాదులోని గన్ పార్కు వద్ద కూడా విద్యార్థులు సామూహిక ప్రతిజ్ఝ చేశారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సామూహిక ప్రతిజ్ఞలు జరిగాయి. ఖమ్మంలో విద్యార్థులు మానవ హారం నిర్మించారు. నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications