విశాఖపట్నం: విశాఖపట్నంలోని ద్వారకా నగర్ యూకో బ్యాంక్ బ్రాంచ్ లో భారీ ఆర్థిక కుంభకోణం చోటు చేసుకుంది. రూ. 353 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఐదుగురు అనుమానితులను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ అధికారులు ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
భారీ కుంభకోణానికి సంబంధించి కనస్ట్రక్షన్ అధికారులు నాగేశ్వర్, కిరణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వర్. వారిద్దరి కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నారు.