ఎదురు తిరుగుతున్న వైయస్ జగన్: క్లైమాక్స్ కు చేరిన రాజకీయం

బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి మాట కూడా జగన్ వినడం లేదనేది స్పష్టమైంది. కాంగ్రెసు అధిష్టానాన్ని, ముఖ్యంగా సోనియా మాటను కాదని ముందుకు పోవడం చాలా మంది పార్టీ నాయకులకే కాకుండా వైయస్ వివేకానంద రెడ్డికి కూడా ఇష్టం లేదనేది స్పష్టమైంది. ఈ స్థితిలో జగన్ వ్యవహారాన్ని తేల్చేయడానికే సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2వ తేదీన జగన్ తిరుపతి వైయస్ సంస్మరణ సభను తలపెట్టారు. 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు. బహుశా వచ్చే నెల 2వ తేదీ లోగానే జగన్ పార్టీతో ఉండాలో, బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకోవాలో నిర్ణయించుకునే పరిస్థితి రావచ్చు.












Click it and Unblock the Notifications