నా దారి నాదే, ఓదార్పు యాత్ర ఆగదు: వైయస్ జగన్

మీ హితబోధలు నాకు అవసరం లేదని, మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన ఆగత్యం పట్టలేదని, నా మనసు మార్చడానికి ప్రయత్నించి సమయం వృధా చేసుకోవద్దని, మీరెంత చెప్పినా తన అభిప్రాయం మారదని, యాత్ర తన వ్యక్తిగతమైందని, తాను ఎవరి మాటా వినాల్సిన అవసరం లేదని జగన్ శాసనసభ్యులపై మండిపడ్డారు. తన యాత్ర వల్ల పార్టీకి నష్టమా, లాభమా అనేది తనకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. యాత్రకు రావాలా, వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలని, రావాలని తాను బలవంతం చేయడం లేదని ఆయన వారితో చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కు శాసనసభ్యులు ఓ నోట్ అందజేశారు.
ఢిల్లీకి జేసీ దివాకర్ రెడ్డితో కలిసి ఎందుకు వచ్చారని జగన్ అడగ్గా, ఆయన, తాము వేరువేరుగా వచ్చామని ఎమ్మెల్యేలు బదులిచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో మహీధర్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవి, విజయకుమార్, జి.వి.శేషు, సురేష్‌కుమార్‌లు ఉన్నారు. వారు ఉమ్మడిగా రెండు పేజీల నోట్ ఆయన చేతికిచ్చారు. వాటిని వారు వివరించబోగా ఆయన వినిపించుకోలేదని సమాచారం. నోట్‌ను మాత్రం ఆమూలాగ్రం చదివారు. ఇవన్నీ తనకు ఎందుకు చెబుతున్నారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.












Click it and Unblock the Notifications