వీరప్ప మొయిలీకి తెలంగాణ పార్లమెంటు సభ్యుల షాక్

తెలంగాణ కోరుకున్నవాళ్లను సీమాంధ్ర మంత్రులు జాతి ద్రోహులుగా అభివర్ణించారని, పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరిస్తున్నారని, ఈ స్థితిలో తాము సీమాంధ్ర మంత్రులతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ఎంపిలు చెప్పినట్లు తెలుస్తోంది. తాము విందుకు హాజరవుతామని, అయితే సీమాంధ్ర మంత్రులతో బల్లలను పంచుకోబోమని, వారితో కరచాలనం చేయబోమని, వారిని పలకరించబోమని తెలంగాణ ఎంపీలు మొయిలీకి వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత సంభవించిన పరిణామాలు సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెసు ఎంపిల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. సాధారణ సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.












Click it and Unblock the Notifications