వైయస్ జగన్ ఓదార్పుపై మరోసారి తేల్చేసిన పురంధేశ్వరి

Purandeswari
విశాఖపట్నం: తమ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి తేల్చేశారు. తాను వ్యక్తిగతంగా జగన్ యాత్రపై చెప్పిదేమీ లేదని, అధిష్టానం చెప్పిందే తాను చెప్పానని ఆమె అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ఆమె ఆదివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ఓదార్పు యాత్రపై తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అందరి ముందే ప్రకటన చేశారని, ఆ విషయాలే తాను చెప్పానని, కొత్తగా చెప్పిందేమీ లేదని ఆమె అన్నారు.

తాను చెప్పింది పొరపాటని భావిస్తే అహ్మద్ పటేల్ తో మాట్లాడి ధ్రువీకరించుకోవచ్చునని ఆమె అన్నారు. అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా నడుచుకున్నందు వల్లనే పార్టీలోని కొందరిపై వేటు పడిందని ఆమె అన్నారు. పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మరికొందరు తమపై ఎందుకు విరుచుకుపడుతున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టడం లేదని, అవకాశం వస్తే ఆలోచిస్తానని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+