మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల మూడోవారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. అంతకు ముందే కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇందుకోసం జాబితాను కూడా తయారు చేసుకున్నారు. అదే సమయంలో బీజేపీలోనూ కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో మరో కొత్త శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నందున, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) తరహాలో ద్వీపకల్ప భారతదేశ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని
విజయసాయిరెడ్డి కోరారు. మన తీరప్రాంత, ద్వీపకల్ప రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక సంస్థ, సముద్ర వాణిజ్యం, ఓడరేవులు, తయారీ, పర్యాటకం, నీలి ఆర్థిక వ్యవస్థ, లాజిస్టిక్స్‌ను అభివృద్ధికి పనికొస్తుందని సాయిరెడ్డి తెలిపారు.

As Hon’ble PM @narendramodi ji is looking at a #CabinetReshuffle, I urge him to create a dedicated Ministry for the Planned Development of Peninsular India, on the lines of the Ministry for the Development of the North Eastern Region (DoNER). A focused institution for our coastal…
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 29, 2026
ఇది వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా, సోనే కి చిడియా (బంగారు పక్షి)గా తన వారసత్వాన్ని తిరిగి పొందడంలో కూడా సహాయపడుతుందని ప్రధాని మోడీకి సాయిరెడ్డి తెలిపారు. సాయిరెడ్డి చేసిన ఈ విజ్ఞప్తిని ప్రధాని మోడీ ఏమేరకు అంగీకరిస్తారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే ప్రధాని కార్యాలయంలో విజయసాయిరెడ్డికి ఓ రేంజ్ లో యాక్సెస్ ఉండేదని ప్రచారం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది మరింత పెరిగింది. ఇప్పుడు వైసీపీని వీడటమే కాకుండా ఎంపీ పదవి కూడా వదులుకున్న సాయిరెడ్డికి ఆ తర్వాత మోడీని కలిసే అవకాశమే రాలేదు.














Click it and Unblock the Notifications