వైయస్ జగన్ ఇష్యూ: చిరంజీవితో కాంగ్రెసు యాక్షన్ ప్లాన్ రెడీ

ఇటీవల డిఎస్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోనూ చర్చలు జరిపారు. ఆయన చర్చల్లో ప్రధానంగా జగన్ పార్టీ నుంచి తప్పుకున్నా, ఒక వేళ జగన్ పై చర్యలు తీసుకోవాల్సి వచ్చినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తులో కోస్తాంధ్రలో పార్టీని నిలబెట్టుకోవడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ ప్రధానంగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని ఆహ్వానించడం ద్వారా జగన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపకల్పన జరిగినట్లు చెబుతున్నారు. అందుకే డిఎస్ చిరంజీవిని కొనియాడినట్లు చెబుతున్నారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి మరోసారి ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గురువారం సమావేశాలకు సినీ నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు హాజరయ్యారు. చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న నాగబాబు సమావేశాలకు రావడం ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా సోదరుల మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలకు తెర పడింది. పూణేలో షూటింగ్ లో ఉన్నందున పవన్ కళ్యాణ్ సమావేశాలకు రాలేకపోయారని చిరంజీవి చెప్పారు. గురువారం రెండో రోజు కూడా చిరంజీవి ప్రసంగం బుధవారంనాటి ప్రసంగం లాగే సాగింది.












Click it and Unblock the Notifications