రాజమండ్రి వేదికగా వైయస్ జగన్ కొత్త పార్టీ?

సెప్టెంబర్ 4వ తేదీన వైయస్ జగన్ తన పార్టీని రాజమండ్రిలో ఆవిష్కరిస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో వైయస్ సంస్మరణ సభ జరుగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ఉంది. ఓదార్పు యాత్ర మధ్యలో వచ్చి రాజమండ్రిలో పార్టీని ఆవిష్కరిస్తారా, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్నే ప్రధానం చేసుకుంటారా అనేది తెలియడం లేదు. అయితే, పార్టీ అధిష్టానం తనపై చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా జగన్ తన కార్యక్రమాన్ని మార్చుకోవచ్చునని అంటున్నారు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే వరకు నిరీక్షించాలనే ఆలోచన కూడా జగన్ వర్గంలో ఉంది. దాన్ని సానుభూతిగా మలుచుకుని కొత్త పార్టీకి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉంది.
పార్టీ అధిష్టానం ఈలోపలే చర్యలకు దిగవచ్చుననే ఉద్దేశంతో అవసరమైతే సెప్టెంబర్ 4వ తేదీన పార్టీకి శ్రీకారం చుట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల పరిణామాలను బట్టి చూస్తే జగన్ పై చర్య విషయంలో జాప్యం చేయకూడదనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications