ఆంధ్రజ్యోతి డైలీపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే గవర్నర్ సూచనపై తీవ్ర దుమారం చెలరేగింది. గవర్నర్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా మండిపడింది. గవర్నర్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించింది. గవర్నర్ తీరును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తప్పు పట్టారు. గవర్నర్ కార్యాలయం నిఘా విభాగం మాదిరిగా మారిందని, రాజకీయమయమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దుమారంతో ఇరకాటంలో పడిన గవర్నర్ ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications