సీమాంధ్ర లెక్చరర్లపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాడి

"సీమాంధ్ర అధ్యాపకులు వాల్యూయేషన్ చేయరాదు..వారి వాల్యూయేషన్ లో మోసం, కుట్ర ఉంది. ఇక్కడి విద్యార్థులపై కక్ష పెట్టుకున్నారు. తెలంగాణ విద్యార్థుల పరీక్షా పత్రాలను తెలంగాణ అధ్యాపకులే దిద్దాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో అక్కడ దాదాపు గంటన్నర సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వ్యాల్యుయేషన్ కేంద్రం నుంచి సీమాంధ్ర అధ్యాపకులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 30లోగా సీమాంధ్ర అధ్యాపకులను పంపించకుంటే తామే తరిమేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత అధ్యాపకుల చేతనే తమ ప్రశ్నాపత్రాలను దిద్దించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విశ్వవిద్యాలయం ఆదేశాల ప్రకారమే తాము వాల్యూయేషన్ కోసం ఇక్కడికి వచ్చామని పలువురు అధ్యాపకులు తెలిపారు. తమపై దాడి చేయటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications