సిఎం, గవర్నర్ అయితే, మేం సీరియస్ కాలేమా: కె చంద్రశేఖర రావు

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే సీమాంధ్రులు వెనక్కి మళ్లించారని ఆయన విమర్సించారు. శ్రీకృష్ణ కమిటీ నిపుణులు పరిశీలించిన మర్నాడే ఆర్డిఎస్ తూములు పగులు గొట్టారని, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పొట్ట కూటి కోసం ఉన్న తెలంగాణవాసులపై దాడులు చేశారని, వారందరిపైనా కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన అన్నారు. కేసులకు తాము భయపడేది లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా ఆడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఆర్డిఎస్ లాంటి దాడులు తాము చేయలేదని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉస్మానియాలో విద్యార్థులు ధర్నా మాత్రమే చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications