బాలికకు ఆరు నెలల గర్భం: మైనర్లకు పెళ్లి చేసిన పురోహితడు

బాలిక గర్భం దాల్చడంతో వారిద్దరు అప్పన్న సింహాద్రి చెంతకు వెళ్లారు. వారికి పురోహితుడు 1500 రూపాయలు తీసుకుని వివాహం చేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లి చేసిన పురోహితుడు పరారీలో ఉన్నాడు. తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని మైనర్లు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆ మైనర్ దంపతుల సమస్యను పరిష్కరించడం ఎలాగో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications