వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై మళ్లీ సాక్షి డైలీ డౌట్స్

సివిఆర్ లో పైలట్, కో - పైలట్ మాటలే ఉన్నాయనీ అంటూ వైయస్, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్..ఎవరి మాటల్ూ ఎందుకు రికార్డు కాలేదని సాక్షి దినపత్రిక ప్రశ్నించింది. సివిఆర్ ట్యాంపరింగ్ జరిగిందా అనే సిబిఐ ఎందుకు దృష్టి పెట్టలేదని అడిగింది. కీలకమైన నాలుగు నిమిషాల పాటు అసలు మాటలు ఎందుకు రికార్డు కాలేదని సాక్షి దినపత్రిక అడిగింది. ఆగస్టాను సిద్ధంగా ఉంచకపోవడంపై అనేక అనుమానాలున్నాయని, కుట్రతో రికార్డులు తారుమారై ఉండవచ్చన్న కోణం సిబిఐకి పట్టలేదని విమర్శించింది. ప్రమాద స్థలంలో ఆరు బుల్లెట్లే దొరికాయని, మిగతా నాలుగు బుల్లెట్ల సంగతేమిటని సాక్షి దిన పత్రిక ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications