వైయస్ జగన్ ను దీవించాల్సిందే: వైయస్ వివేకానంద రెడ్డి

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సారథ్యంలో ఉన్నత ప్రమాణాలతో స్ఫూర్తిగా నిలిచిన కాంగ్రెస్ పేద ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ అమలుచేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను వైఎస్ హయాంలో చేపట్టారని అన్నారు. అప్పట్లో సంక్షేమ అభివృద్ది పథకాలను ఏకకాలంలో రెండు కళ్ళులా వైఎస్ అమలు చేశారని అన్నారు. అయితే వీటికి నిధుల కొరత లేకుండా అప్పటి ఆర్థిక శాఖామంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా అప్పులు తీరుస్తూనే అన్ని పథకాలకు బడ్జెట్ కేటాయించారని మెచ్చుకోలు ప్రకటన చేశారు. వైఎస్, రోశయ్య ఇద్దరి మేలు కలయిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఊతమేశాయని చెప్పారు. మహాకూటమి పేరిట మిగతా పార్టీలు జతకట్టినా కాంగ్రెస్‌ను ఓడించలేక చతికిలపడ్డాయన్నారు. దీనికి అప్పటి వైఎస్ఆర్ సారథ్య పటిమేకారణమన్నారు.












Click it and Unblock the Notifications